వర్కర్స్ యూనియన్ గెలవాల్సిందే..ఆర్టీసీ ఎన్నికల సన్నాహక  సమావేశంలో పీసీసీ చీఫ్

వర్కర్స్ యూనియన్ గెలవాల్సిందే..ఆర్టీసీ ఎన్నికల సన్నాహక  సమావేశంలో పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆర్టీసీ వర్కర్స్​ యూనియన్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. సోమవారం ప్రజా భవన్ లో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఇందులో మహేశ్ గౌడ్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీ సురేశ్ షెట్కార్, కాంగ్రెస్ తరపున ఎన్నికల ఇన్​చార్జిబొంతు రామ్మోహన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్  యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి, టీఎంయూ జనరల్ సెక్రెటరీ అశ్వద్థామ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

కార్మికుల భవిష్యత్తు, వారి పనివేళల పరిరక్షణ, విలీన ప్రక్రియ, శాశ్వాత సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలు, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు  ప్రతి కార్మికుడు గుర్తించి ఓటు వేసేలా చూడాలని ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.